కొత్త (కరోనా) కథలు – 4 – గానగంధర్వ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంగారి స్మరణలో
80 మంది రచయితల కథాసంకలనం
గత నాలుగేళ్లుగా డా. ఆళ్ల శ్రీనివాసరెడ్డిగారి సహకారంతో, వంశీ రామరాజుగారి ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం ఒక స్పెషల్ పుస్తకం విడుదల అవుతోంది.. మొన్నటి, నిన్నటి, నేటి ఎంపిక చేసిన రచయితలతో కొత్తకథలు రాయించి అందమైన పుస్తకంగా తయారు చేసి హైదరాబాదులో భారీ సభ నిర్వహించి ప్రముఖుల సమ్ముఖంలో ఆయా రచయితలందరినీ వేదిక మీద సత్కరిస్తారు. ఇది ఒక పుస్తకం మాత్రమే కాదు. ఎందరో పాత రచయితలను, నేటి రచయితలను వారి కథలతో కలుసుకోవడం ఈ వేదిక ముఖ్యోద్ధేశ్యం..
కాని గత సంవత్సరం నుండి ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి గుప్పెట్లో చిక్కుకుంది. ఈ సమయంలో పుస్తకం చేయడం, సభ నిర్వహించడం సాధ్యమేనా అని ఆలోచించి పుస్తకం పూర్తి చేయడంలో కాస్త ఆలస్యం జరిగింది. చివరికి కరోనా ముఖ్యాంశంగా 80మంది రచయితలు మంచి కథలు పంపించారు. ఈ మాయదారి కరోనా మనకు దూరం చేసిన గానగంధర్వుడు శ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంగారి స్మరణలో కొత్త(కరోనా)కథలు 2020 పుస్తకం తయారైంది.
పేజీలు: 564
ధర: రూ.400
ప్రారంభోత్సవ ఆఫర్: రూ. 200 (పోస్టేజ్ అదనం)
కావలసినవారు జ్యోతి వలబోజు. 8096310140 కి gpay, phonepe, paytm ద్వారా డబ్బులు పంపించి, రసీదు, అడ్రస్ ఇదే నంబరుకు వాట్సాప్ చేయండి.
ఈ ఆఫర్ జూన్ ముప్పైవరకు మాత్రమే.. ఈ పుస్తకం అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మంతా వెేగేశ్న ఫౌండేషన్ దివ్యాంగుల ఆశ్రమానికి ఇవ్వబడుతుంది.
ధన్యవాదాలు!
కౌండిన్య (రమేష్ కలవల)






