బస్సు స్టాపులో నించున్నాను. ఆయన తెలుగువారిలా ఉండటంతో “నే కథలు రాస్తానండి” అనగానే ఆయన అయితే అన్నట్లుగా ఎగా దిగా పైనుండి కిందవరకూ చూసాడు. కొంచెం దూరంగా జరిగాడు, నేను ఆయనకు దగ్గరగా జరిగాను. ఆయన చేతికి నా పుస్తకం అందించాను.
ఆయన పేజీలు గిర్రున తిరగేసారు, దానికి చల్లటి గాలి తగిలి ఇదేదో బావుందని బస్సు కోసం అటు చూస్తూ దాంతో విసురుకోవడం మొదలుపెట్టారు.
“లోపల ఓ పదిహేను కథలు.. “ అంటుండగా
“ఈ మధ్య నాకు చదివే అలవాటు పోయింది మాస్టారు” అనేలోగా ఆయన చేతిలో పుస్తకం లాక్కోబోయాను. మిస్ అయ్యింది.
“ఫర్యాలేదు. మీరు స్మార్ట్ గా కనపడుతున్నారు. స్మార్ట్ ఫోన్ ఉండి ఉండాలే మీ దగ్గర” అన్నాను. ఆ పుస్తకం నాకు ఇచ్చేసి ఒక్కొక జేబులోంచి ఒక్కో ఫోన్ తీసారు గర్వంగా.
“అయితే టెక్నాలజీ ను బాగా వాడేసుకుంటున్నారన మాట” అన్నాను.
నా ముందే హెడ్ఫోన్స్ చెవుల్లోకి తోసి తన్మయత్వంతో వినడం మొదలు పెట్టారు.
ఆయన చేతిలో ఉన్న ఇంకో ఫోను తీసుకొని యుట్యూబ్ లో కొత్తగా “కౌండిన్య కథల కార్నర్” ఛానెల్ లో ఓ కథ ఆడియో ప్లే చేయడం మొదలు పెట్టి ఆయన హెడ్ఫోన్స్ ఆయన చేతిలో ఉన్న ఫోను నుండి పీకి నా చేతిలో మొబైల్ కు కనెక్ట్ చేసి అది ఆయనకు అంద చేసాను.
ఆలా ఆకాశం వైపుకు చూస్తూ ఆ కథ వింటూ నవ్వుతూ, మధ్య మధ్యలో తట్టుకోలేక నన్ను చిరు దెబ్బలు వేయడం మొదలు పెట్టాడు ఎన్నాళ్ళో పరిచయం ఉన్న వారిలా. నేను దూరంగా జరిగాను ఆయన దగ్గరగా జరిగాడు.
“కథంతా విని ఆ కథ మీ ఈ పుస్తకంలో ఉందా?” అన్నారు
“అవునండి. అలాంటివి ఇంకో పద్నాలుగున్నాయి” అన్నాను.
“ఇంతకీ ఎంతన్నారు?” అని అడిగాడు.
“వంద రూపాయలు. మీకు కాబట్టి నూట పది చేసి ఓ పది శాతం డిస్కౌంట్ ఇస్తానన్నాను”
నవ్వాపుకోలేక ఒక్కటి చరిచాడు. బస్సు స్టాపు నుండి రోడ్డు మీదకు పడబోయాను. “మీరు ఓవర్ స్మార్టు” అన్నారు. ఈయనకు సంతోషం వస్తే దరిదాపులలో కూడా ఉండకూడదన్న అభిప్రాయానికి వచ్చి అప్పటి నుండి జోకులు గట్రా వేయకుండా ఆ పుస్తకం అందించాను. జేబులోంచి వంద రూపాయలు తీసి ఇచ్చారు. ఓ రూపాయి తీసి ఇవ్వబోతే ఫర్వాలేదు అన్నట్లుగా నా చెయ్యి నెట్టారు.
ధన్యవాదాలు తెలిపి “మీరు కౌండిన్య కథల కార్నర్ ఛానెల్ సబ్స్కైబ్ చేసుకుంటే గనుక ఇలానే బోలెడు కథలు వినవచ్చు” అన్నాను. సంతోషంతో దగ్గరకు రాబోయాడు. ఎందుకైనా మంచిదని సెలవు తీసుకొని ఆటో వాడిని పిలిచి అటు పరిగెత్తాను.
అదండి సంగతి! మీరు కూడా ఆయన లానే ప్రయాణం చేస్తూనో లేక ఏ బీచ్ లో కూర్చొనో ఈ క్రింద ఉన్న లింకు ద్వారా కొన్ని కథలను వినవచ్చు. ఈ కథలను విని ఎలాఉన్నాయో మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయగలరు.
ఇందాకా ఆయన విన్న కథ చదివినది మా చెల్లెలు శైలజ నేతి.
https://www.youtube.com/channel/UC__yz5aUgBEx_jLGFKEfPjA
ధన్యవాదాలు
కౌండిన్య – 30/03/2018