( రెండు చిన్న కథల అనువాదం సంస్కృతం లోకి)
కాకతాళీయం – వాడుక (తెలుగు)
ఒక వ్యక్తి పొలంలో ఉన్నాడు. తాడి చెట్టు క్రింద కాకిని చూసాడు. పైనుండి తాడి పండు కాకి మీద పడింది. ఇది అనుకోకుండా జరిగింది. దీనినే “కాకతాళీయం” అంటాము.
కాకతాళీయం – ఉపయుజ్జతామ్ (సంస్కృతం)
ఏకస్మిన్ పురుషః క్షేత్రే అస్తి । సః తాళావృక్షస్య అథః కాకాం దృష్ఠవాన్ । ఉపరితః కాకస్య ఉపరి తాళాఫలం పతితమ్ । ఆకస్మికతయా ఏవ అభవత్ । ఏతమ్ కాకతాళీయం కయ్యతే ।
కాకి, కడువ (తెలుగు)
“ఒక కాకి చెట్టు మీద నివసిస్తోంది. ఒక రోజు దానికి బాగా దాహం వేసింది. అంతా వెతికింది, నీళ్ళు ఎక్కడా కనపడలేదు. కాకి చాలా దూరం ఎగిరింది. ఒకచోట ఒక కుండ కనిపించింది. కుండ లోపలకు చూసింది. దాని లోపల కొంచెం నీళ్ళు కనిపించాయి. కాకి ఆలోచించింది. “ఒక ఉపాయం ఉంది” అనుకొంది. కాకి ఒక రాయి తీసుకొని నీళ్ళలో వేసింది. మళ్ళీ ఒక రాయి తీసుకొని నీళ్ళలో వేసింది. మళ్ళీ మళ్ళీ అలానే చేసింది. నీళ్ళు పైవరకూ వచ్చాయి. కాకి నీళ్ళు త్రాగింది. తరువాత సంతోషంతో ఎగిరిపోయింది.
కాకః , ఘటః (సంస్కృతం)
ఎకస్మిన్ వృక్షే ఏక కాకః వసతి । ఎకస్మన్ దినే కాకః బహు పిపాసితః భవతి । అత్ర పష్యతి, జలం నాస్తి । సర్వత్రా పష్యతి జలం నాస్తి । కాకః బహు దూరం ఉడ్డ్యతి । తత్ర ఏక ఘటం పష్యతి । ఘటస్య అంతః పష్యతి । తత్ర స్వల్ప జలమ్ అస్తి।
అతః కాకః చింతయతి । “ఆ ఏకః ఉపాయః అస్తి” । కాకః ఏకం శిలాఖండే స్వీకరోతి. జలే స్వాపయతి । పునః ఏకం శిలాఖండే స్వీకరోతి । పునః పునః ఏవమేవ కరోతి । జలమ్ ఉపరి ఆగచ్ఛతి. కాకః జలం పిబతి. అంతరం సః సంతోషేణా ఉడ్డ్యతి ।
కౌండిన్య (రమేష్ కలవల) – 27/03/2023