కలం కౌండిన్యది కదులుతూనే ఉంది, ఈ కలం
కమనీయతను పెంచుతూ,
కావేరి కథ కనుచూపుమేరకు తెస్తోంది, కాన
కాళ్ళ మీద కాళ్ళేసుకు కూర్చోమని ఓ చిన్న విన్నపం.
కొత్త కథనం కోసం కంగారు పడకుండా,
కోకొల్లలుగ ‘క’ అనే పాత్రల మీద వ్రాయలని, ఆ కథలు
కౌముది ని కొంటెదాన్ని చేసి, ఆ
కౌశల లో కలుపుగోలుదనాన్ని చూపి,
కంచంలో వేసిన కలగాపులగంలా కలిసి,
కః పూర్వః అనే లాగా ఉండాలని కోలుకుంటున్నాను.
కధలు
కాకరకాయలతో
కితకితలు పెట్టిస్తూ
కీలుగుర్రంలా కథల దౌడు తీస్తూ
కుదురుగా
కూర్చోకుండా
కెంపుల లాంటి కథ లతో
కేక పుట్టించే నీ కథనాల
కై ఎదురుచూపులు చూపిస్తూ
కొత్త కొత్త ఆలోచనలన్నింటినీ
కోరుకున్న విధంగా మలుస్తూ కధా
కౌశలం పెంచుకుని కల
కండ లాంటి కథలు నీ కలం చెప్పాలి
కః పూర్వః లాగా వుండాలి
కరతళాధ్వనాలు కొట్టేలా
కాకతాళీయంగా కాకుండా
కిన్నెరసానులు కొనియాడేలా
కీర్తి తెచ్చేలా
కుంకుమ ఆభరణంలా
కూర్పులు చేసి
కెరటాల ధాటిలా
కేంద్రబిందువైన చంద్రుడి ప్రకాశం వలె
కైవల్య పదములుగా
కొనియాడే లా
కోకిల కుసేంత తియ్యగా
కౌండిన్య కలం కమనీయమైన కథనాలు
కంఠాభరణాలు గా మిగలుతాయి
కః పూర్వం లాగే ఉంటాయి, సరేనా
కౌండిన్య – 29/08/2016