లాలించి పాలించే తల్లీ,
ముద్దు మురిపాలు కురిపించే నను కన్న తల్లి!
నన్ను మైమరపించే తల్లీ,
మమత అనురాగాలిచ్చే నను కన్న తల్లి!
శక్తిని ప్రసాదించే తల్లీ,
సామర్థ్యాలు సమృద్దిగా సమకూర్చే నను కన్న తల్లి!
నన్ను తీర్చిదిద్ధే తల్లీ,
ఆశీర్వచనాలు దీవెనలతో రక్షించే నను కన్న తల్లి!
ఓ మాతృుమూర్తి, నీ ఋణానుబంధం
ఎన్ని జన్మలదో?
కౌండిన్య