రాగం : హంసనాదం, తాళం : ఆది.
పల్లవి

బంటు రీతి కొలువు ఈయవయ్య రామా | (బంటు)అనుపల్లవి
తుంట వింటి వాని మొదలైన మదా- |
దుల గొట్టి నేల గూల జేయు నిజ || (బంటు)
( తా: తనకు కామ, క్రోధ మదాదులను కొనగోటితో సంహరించగల బంటురీతి కొలువు (సైనికుడు వంటి ఉద్యోగం) ఇమ్మని రామున్ని ప్రార్ధిస్తున్నాడు )చరణం
రోమాంచ మను ఘన కంచుకము |
రామ భక్తుడను ముద్ర బిళ్ళయు ||
రామ నామ మను వర ఖడ్గ మివి |
రాజిల్లు నయ్య త్యాగరాజుని కే || (బంటు)
(తా : రామ నామమనే ఖడ్గాన్ని, రామభక్తుడనే ముద్రబిళ్ళను, రోమాంచమనే ఘన కంచుకమ (రామనామం తలవగానే ఆనంద పారవశ్యం తో ఒంటిపై నిక్కబొడుచుకొన్న వెంట్రుకలు అనే కవచం) ఇవ్వమని అడుగుతున్నాడు త్యాగయ్య )
కౌండిన్య – 29/02/2024