తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) వారి ఉగాది సంచికలో మేగజైన్ లో ప్రచురితమైన హైకులు.
కౌండిన్య – 27/04/205
హైకు గురించి: ప్రపంచ సాహిత్యంలో మూడు పాదాలు కలిగిన అతి చిన్న పద్య ప్రక్రియ. మొదటి పాదం లో 5, రెండవ పాదంలో 7, మూడవ పాదంలో 5 అక్షరాల (సిలబుల్) మాత్రమే ఉండాలి.
16వ శతాబ్దం నుంచి జపానులో ప్రచారంలో వుంది. హైకూలో వస్తు, స్థల, కాలాలు అనే మూడు అంశాలు మధ్య సజీవ సంబంధం వుంటుంది.
హైకు పద్యానికి అనుభూతి ప్రధాన మైంది. నిజానికి ప్రకృతి కవిత. తాత్వికత దీని ప్రాణం. ఎలాంటి వస్తు నిర్దేశం లేకుండా కేవలం ఊహాత్మక రూప ప్రక్రియ ఇది.

