దేవ మహేశ్వర లోక పరాత్పర
“శివ” మనే నక్షరద్వయేసా
నీల గళాపతి శీతల కౌముది
గణ షణ్ముఖ పిత గిరీసా
నిత్య తపోనిధి నీల లోహిత
సకల లోక పరి పాలేసా
హర గంగాధర చంద్రభూషణ
జటాజట ధార లోకేసా
శంఖ దుందుభి వృషభ వాహన
త్రశూల ధారి ఢమరు కేసా
పాప హరేష పరమ పవిత్ర
చరణ సరోజరజ జగదీశా
కమనీయ లోచన హిమవాస
కరుణా గత విశ్వాంబరీస
కబాల పసుపతి విభూదితనయ
స్మశాన విహారి దిగంబరేసా
తాండవ మోహన దేవగణాన్విత
శంభో శంకర రుద్రేసా!