శబ్ధరసాలు ఎన్నో;
కొన్ని కమనీయమైనవి,
కొన్ని స్రావ్యమైనవి,
కొన్ని సామాన్యమానవి,
కొన్ని అసాధారణమైనవి,
కొన్ని చిర్రెత్తించేవి,
కొన్ని భయంకరమైనవి,
కొన్ని మాధుర్యమైనవి,
కొన్ని ఒళ్ళు పులకరించేవి,
కొన్ని కనబడనివి,
కొన్నేమో మనసుకు తప్ప వేటికీ వినబడనివి.
అవీ;
ప్రణవ నాదాలు, ఢమరుక శబ్ధాలు, శంఖా రావాలు, భేరికా నినాదాలు, కంచూ మ్రోగడాలు, గంటల గణగణలు, గజ్జెల ఘల్లులు, వీణ మీటడాలు, వేణు గానములు, తబల వాయించడాలు, డప్పుల చప్పుళ్ళు, మృదంగ మాధుర్యాలు, నాద స్వరాలు, తంబూర తట్టడాలు, భాజా భజంత్రీలు, సన్నాయి పిపిపీలు, సప్త స్వరాలు, కోళ్ళాటం నాట్యాలు, కరతలా ధ్వనాలు, చిటికెల శబ్ధాలు, కోయల కూయటాలు, కాకి అరవటాలు, చిలక పలుకులు, పిచ్చుక పలకరింపులు, పావురాయి గుర్రులు, కీచురాయీ కీచు అరుపులు, పాము బుసలు, తోడేళ్ళ కూతలు, గుర్రపు సకిలింతలు, సింహం గర్జనలు, లేడి పరుగులు, పులి గాండ్రంపులు, మేకల అరుపులు, కుక్కల బౌబౌలు, పిల్లుల మ్యావ్ లు, కోళ్ళ కొక్కొరోకోలు, ఆవుల అంబాలు, ఉరుము మెరుపుల విజ్రంభణలు, సెలయేరు సవ్వడి చప్పుడులు, ఎత్తి పోతల నీళ్ళు పడటాలు, గాలి ప్రభంజనాలు, అగ్ని మంటలు వ్యాపకాలు, అగ్నిపర్వత విస్పోటనాలు, నదీ ప్రవాహలు, సముద్ర కెరటాలు, సంగీత స్తంభాలు, మాటల స్రావ్యాలు, వేద ఘోషణలు, మంత్ర ఉచ్ఛారణలు, పండితుల ఆశీర్వచనాలు, ఆర్త నాదాలు, ప్రసవ వేదనలు, ప్రసవించిన బిడ్డ ఏడుపులు, ఉగ్గు పాల ఉంగాలు, పసి వాని కేరింతలు, గాలికి కొమ్మల రాపిడిలు, భక్తి కీర్తనలు, మధుర భజనలు, పాడే పాటలు, విప్లవ గీతాలు, హార్మోనియం గజల్ లు, వీరుని ఘీంకారములు, జాతీయ గేయాలు, గుండె చప్పుడులు, రక్త ప్రవాహాలు, ఊపిరి శ్వాసలు, వేడి నిట్టుర్పులు, మనసు ఆవేదనలు, అలసట గురకలు, కూని రాగాలు, వీల పాటలు, మనుషుల మాటలు, తలుపుల కిర్రులు, గాలికి భళ్ళున తెరుచే తలుపులు, స్టీలు పళ్ళాలు పడటాలు, హరిదాసు పాటలు, బిచ్చగాడి అరుపులు, నావల హైలెస్సాలు, పడవల పందాలు, రైళ్ళ కూతలు, వాహనాల హారనులు, రేడియో ధ్వనులు, ట్ర్యాక్టర్ ఇంజన్ టక్కు టక్కులు, మైకుల సౌండ్ల్ లు, వీథి కొట్లాటలు, చినుకుల చిటపటలు, వర్షపు జోరులు, హోరు గాలులు, పక్షుల కిలకిలరావాలు, సంగీత నృత్య సాధనలు, చాకలి బట్టల బాదుడులు, పనిమనిషి అంట్లు తోమటాలు, బోరింగ్ నీళ్ళు కొట్టటాలు, కుట్టు మిషన్ కుట్టడాలు, సైరనులు హారన్ లు, శబ్ధ కాలుష్యాలు, కాల్పుల శబ్ధాలు, పేలుళ్ళ విస్పోటాలు, పీచు మిఠాయి గంటలు, సోడా కొట్టడాలు, సైకిల్ బెల్లులు, రిక్షా లో వెళ్ళే కిర్రు శబ్ధాలు, ఆటో రిక్షా స్టార్ట్ చేయటాలు, టైపింగుల టప టపలు, ప్రింటింగు అచ్చుల మెషినులు, ఫోనులు మ్రోగడాలు, కత్తి సానపెట్టడాలు, శిల్పాలు చక్కడాలు, నేత నెయ్యటాలు, బొమ్మలు గీయడాలు, బట్టీకొట్టంచడాలు, బడిలో అసెంబ్లీ లు, విరామ సమయంలోని పిల్లల ఆటలు, పాత సామన్లు కొంటామనే అరుపులు, కోతి గారడి చేతి ఢమరుకాలు, సంక్రాంతి గంగిరెద్దుల సన్నాయి, పాముని ఆడించే నాగస్వరాలు రంగుల రాట్నం తిరిగే శబ్ధాలు, ఊరేగింపు ప్రదర్శనలు, పార్టీ సభల ప్రసంగాలు, బ్యాండ్ బారాతీలు, నదుల హారతులు, రథోత్సవాల రథం లాగే ఉత్తేజాలు, తిరుణాల బూరల శబ్ధాలు, బస్సు లో కండక్టర్ కొట్టే బెల్లులు, హోటల్లో సర్వర్ ఆర్డర్ లు, పచ్చడి దంచడాలు, పప్పు రుబ్బటాలు, పిండి మరలో మెషినులు, బంటోతు ను పిలిచే టేబుల్ మీద కొట్టే బెల్ లు, కాఫీ గింజల మర మెషిన్లు సౌండ్ లు, తుమ్మెద పువ్వుల మీద కారాడడాలు, ఈగ తిరిగే శబ్ధాలు, తూనీగ ఎగిరే వినికిడిలు, దోమ చెవి దగ్గర చేసే గోలలు, అడవడి నడకల చప్పుడు, బొరుగు పేలాలు పేలే శబ్ధాలు, కాఫీ తిరగకొట్టే శబ్ధాలు, తిరగమోత చిటపటలు. జైలు కటకటాల తెరిచే శబ్ధాలు, కను రెప్పల మూసే శబ్ధాలు, విమానాలు మేఘాల మీద ప్రయాణించడాలు, సోనిక్ జెట్ ఆకాశం ఛేదించడాలు, ర్యాకెట్ గగనతలానికి ఎగిరడాలు, క్రీడల చప్పుడులు, రైళ్ళళ్ళో అమ్మకాల అరుపులు, చెవిలో గుస గుసలు, ఇలా ఇవి ఎన్నో మరెన్నో.
ఈ శబ్ధరసాలే గనక లేకపోతే మిగిలేది నిశ్శబ్దం. ఆ సమయంలో వినిపించేదల్లా, మనస్సు చేసే, ఓ శబ్ధం!