నిన్నొక రామ తీర్థం,
రేపొక శివ క్షేత్రం,
అడుగడుగున అగుపిస్తున్న దీన హీన దృశ్యం,
పదేపదే ప్రతిబింబిస్తున్న పైశాచిక ద్వేషం.
మిత్రమా!
భారతదేశ చరిత్రకేదో శాపం ఉంది,
చిత్రమో, విచిత్రమో మన సమాజంలో ఎనలేని లోపం ఉంది,
కనిపించని ప్రభావానికి లొంగుతున్న నికృష్ట దోషం కూడా ఉంది.
నీతిని వదిలేసిన రాజనీతి,
జాతి సంస్కృతిని వెలివేసిన నవత రీతి.
గ్రహించడం లేదు పాపం వీళ్ళు,
కట్టడాలు కూల్చినా, విగ్రహాల తలలు త్రెంచినా,
ఏమీ పట్టనట్లు నిద్రిస్తున్న వారిని ఇక ఆ రుద్రుడే జాగృతం చేయాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలి.
మీ కన్నీరు గుండెలో అణుచుకొవడం కంటే,
స్థిరంగా నిలుపుకోవాలకున్న విలువలని చెరిపివేయకుండా మీ వంతు కృషి చేయండి!
రండి.. రండి. రండి. లాస్టు రండి.
నాకు గనక కోపం వస్తే కవితలు వ్రాసి సమాజం మీదకు వదులుతాను, కబద్ధార్!… సరే ఇక ఉంటా! వీటి నుండి తప్పించుకునే బాధ్యత సమాజానిదంటా!
కౌండిన్య – 02/01/2021