“వసంతంలో ఒక రోజు పొద్దున ఎత్తైన తాటిచెట్టు నుండి అప్పుడే తీసిన తాటికల్లుని తన మనవరాలికి త్రాగడానకి ఇచ్చినందుకు ఆ ఈండ్రవాఁడిని చివాట్లు పెట్టాను.
ఆ పాప ఎవరో కూడా నాకు తెలీదు, తాటి ఆకుతో చేసిన గరిటతో కల్లు త్రాగుతూ తన మొహం కూడా సరిగా కనపడటం లేదు. వెర్రి పిల్ల! ఆ త్రాగేది కల్లు అని కూడా తెలియని పసి వయసు.
ఆ ముసలాయన నా చివాట్లు పెడచెవున పెడుతూ “ఏం కాదులే ఆయ్యా” అన్నాడు.
“కొత్త కల్లు తల్లి పాలతో సమానం. కానీ దొరా, అది ఊరితే ఉంటాది నా సామిరంగ!” అన్నాడుట నవ్వుతూ.”
ఇదండి ఈ “(ఈండ్రవాఁడి)కల్లుగీయువాఁడి సిద్దాంతం” అంటూ “సోనెట్స్ ఆఫ్ ఈస్ట్ అండ్ వెస్ట్” అనే పుస్తకంలో “ఓ గోదావరి ఆహ్లాదకర సంఘటన” అంటూ ఒక పద్యం(సోనెట్) రాసారు శ్రీ ఆస్వాల్డ్ జెన్నింగ్ కూల్డ్రే. సాదారణంగా ఇంగ్లీషు కావ్యాలలో “సోనెట్” అనేది పదునాలుగు చరణాలు కలిగిన ఒక విధమైన పద్యం.
ఈ సంఘటనను “ది ఫస్ట్ సిప్” అనే పేరుతో చిత్రీకరించి “సౌత్ ఇండియన్ అవర్స్”(దక్షిణ భారత స్మృతులు) అనే పుస్తకంలో జతపరిచారు.
ఆయన దక్షిణ భారతదేశంలో మఖ్యంగా ఆంధ్రదేశంలో గడిపిన తొమ్మిదేళ్ళు అనేక సంఘటనలను పద్య, గద్య రూపాలలో గ్రంథస్థం చేయటమే కాకుండా, చక్కటి చిత్రాలుగా కూడా మలిచారు శ్రీ కూల్డ్రే.
ఆయన చిత్రాలను స్పూర్తిగా తీసుకొని మాంచి “ఖళా కండాలుగా” మలచాను, మీరు తక్కువలో కొనుక్కోవడానికి ఇప్పుడే సదవకాశం, ఎందుకంటే నేను ఫేమస్ అయ్యాక మీరు వాటిని కొనాలంటే బోలేడు డబ్బులేసి కొనాలి. తరువాత మీ ఇష్టం!
కౌండిన్య – 11/04/2019
The Toddy-Drawer Philosophies
A Godavery Idyll.
One morning I reproved old Appardu,
That Silen of the palms, for offering
His granddaughter a drink of the weird spring
That in the tree-top tall he lately drew
The silly naked child, I hardly knew
Her sweet face, hidden in the palm-leaf spoon
Poor little brown Eve, tempted all too soon
With worse than any apple, this tree’s brew!
“Nay” said the old man laughing, “the parm-wine,
When first it feels the air, is innocent
As mother’s-milk, fit playmate for a child.
Later indeed, Sir, like the Soul Devine,
With time and ripeness it grows turbulent,
And we, that entertain it, are beguiled.”
Prof. Oswald Jennings Couldrey
Sonnets of East and West
