నిన్నటి తరం – నేటి తరం
కుటుంబాలలో నిన్నటి తరం, నేటి తరం,రేపటి తరం వాళ్లు కలసిమెలసి ఉండకపోయినా, అప్పుడప్పుడు కలుస్తూ సంతోషంగా ఉంటారు.
సాహితీరంగంలో ఇలా నిన్నటి తరం రచయితలు, నేటి తరం రచయితలు అప్పుడప్పుడైనా కలిసే అవకాశం ఉంటుందా? ఏమో… ఉండచ్చు.. ఉండకపోవచ్చు..
కాని తెలుగు సాహితీరంగంలో ప్రముఖులైన అనే కాకుండా మంచి మంచి రచనలు చేస్తున్న ఆనాటి, నేటి రచయితలను కలపాలని ఒక వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టారు వంశీ రామరాజుగారు, డా. ఆళ్ల శ్రీనివాసరెడ్డిగారు. 2017 లో ప్రారంభమైన ఈ ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. మొదటిసారి 33 మంది మహిళా రచయితలతో కొత్తకథలు -1, రెండవసారి 65మంది రచయితలు, రచయిత్రులతో కొత్త కథలు – 2, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మెగా పుస్తకంగా రాబోతోంది కొత్తకథలు – 3.. ప్రతీ సంవత్సరం ఒక గొప్ప వ్యక్తికి సంస్మరణగా ఆవిష్కృతమవుతోంది కొత్తకథలు పుస్తకం.
ఒకటి కాదు, రెండు కాదు మొత్తం 60 మంది రచయితలు, రచయిత్రుల (తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రవాస రచయితలు కూడా ఉన్నారు) కొత్తకథలతో, 72 పేజీలతో , స్వర్గీయ నటసమ్రాట్ అక్కినేనిగారికి సంస్మరణలో అద్భుతంగా, అందంగా జె.వి. పబ్లికేషన్స్ ద్వారా తయారయ్యింది ఈ మెగా పుస్తకం కొత్త కథలు – 3 (2019).
ఈ నెల 17న రవీంద్రభారతిలో సాయంత్రం 4 గంటలు ప్రారంభమయ్యే ప్రత్యేక సమావేశంలో ఈ పుస్తకం ఆవిష్కరించబడుతోంది. అంతే కాదు ఈ పుస్తకంలోని రచయితలను వేదికమీదకు ఆహ్వానించి సత్కరిస్తారు.
ప్రియ పాఠకులకు ఒక స్పెషల్ ఆపర్:
పుస్తకం విడుదల అయినరోజు అంటే జులై 17న రవీంద్రభారతిలో ఈ పుస్తకానికి 50% రాయితీలో లభిస్తుంది. అంటే రెండు వందలా యాభై రూపాయలు మాత్రమే. కొత్త కథలు – 3 ( 500).
సభకు హాజరు కాలేని వారికోసం కూడా ఈ ఆఫర్ ఈ నెలాఖరు వరకు ఉంటుంది.
కౌండిన్య – 12/07/2019
