ఓ కథ, తరువాతి కథ వ్రాయి!
సామాన్య జీవితాలు, చిరు అగచాట్లు.
బాధ, వేదనతో కూడిన గాథలు,
సరళంగా, స్పష్టతతో, ముక్కు సూటిగా చెప్పేలా,
రోజూ వేయి కన్నీళ్ళు ప్రవహించే వాటి గురించి,
వాటిలో విస్మరించని కొన్నిటి గూర్చి,
విస్తృతమైన, వివరణ లేకుండా,
సామాన్యంగా, దృఢమైన కథనంతో,
సిద్దాంతాలకు, తత్వశాస్త్రాలకు తావులేకుండా,
ఏ కథకు పూర్తి పరిష్కారం చూపకుండా,
కొస ముగింపు లేకుండా,
హృదయం మాత్రం ఆర్ద్రతతో నిండేలా,
లెక్కలేని పదాలతో,
అంతులేని కథలతో,
విచ్చుకోకుండానే మొగ్గను తుంచినట్లు,
కీర్తి ధూళి శ్లాఘించకుండనట్లు,
ప్రేమ,భయం,తప్పుల గురించి,
తెలియని వేల జీవితాల గూర్చి వ్రాయి!
(తెలుగు అనువాదం) – కౌండిన్య – 17/03/2023
(బర్సా యపన్ – సోనార్ తరి – శ్రీ రబీంద్రనాథ్ ఠాగూర్.)
Write story after story
small lives, humble distress
tales of humdrum grief and pain
simple, clear straightforwardness
of the thousands of tears steaming daily
a few saved from oblivion
no elaborate description
plain steady narration
no theory or philosophy
no story quite resolved
not ending at the end
but leaving the heart uneasy
all the words unnumbered
stories never completed
buds unripey torn
dust of fame unsung
the love, the terror, the wrong
of thousands of lives unknown
Barsa Yapan – Sonar Tori – Sri Ravindranath Tagore
