प :
आज अयोध्या सजली
फुले प्रीतिची आनंदाच्या अश्रूंनीं भिजली
श्रीरामाच्या पूजेसाठी आज अयोध्या सजली सजली
च १:
गुढ्या पताका तोरण साजे
रूपे घेती अवयव माझे
अभंग नौबत कंठामधुनी दाही दिशा गाजली
च २:
पंचप्राण हे लावून ज्योति
सर्वांगाने करिन आरती
भावभक्तीची टाळमंजिरी तालावर वाजली
च ३:
सर्वस्वाच्या नैवेद्यानें
एकरूप हो दोन जीवनें
तुझ्या कृपेची अमृतवेली मनोमनी रुजली
తెలుగులో భావం:
పల్లవి:
అయోధ్య ఈ రోజు అలంకృతమాయె
ప్రేమతో అర్పించిన పుష్పములు ప్రమోదాశృవులతో ఆర్ద్రమాయె.
శ్రీ రాముని సపర్యకు అయోధ్య అలంకృతమాయె.
చరణం 1:
గవనుపై బావుటా తోరణ భూషణమాయె.
శరీర సర్వాంగాలు ఉత్సవ రీతికి అంకితమాయె.
అభంగ కంఠమాధుర్య స్వరదుందుభి దశదిశలా వితతమాయె.
చరణం 2:
దీపజ్యోతితో పంచ ప్రాణాలు అర్పితమాయె.
సర్వస్వమూ సంగీత నీరాజనమాయె.
భవభక్తితో మంగళ వాయిద్య మేళతాళాల నాదమాయె.
చరణం 3:
సమస్తమూ నైవేద్య మర్పితమాయె.
ద్విముఖ జీవన మమేకమాయె.
అమృతతుల్య అనుగ్రహ నిమిత్తము స్వాంతన నిమగ్నమాయె!
కౌండిన్య – 10/08/2020