రాగాలతో
రాగ భావాలతో
భావాలతో
భావామృత స్వరాలతో
స్వరాలతో
స్వరజతుల దివ్యక్షరాలతో
దివ్యాక్షరాలతో
దివ్యాక్షర కీ్ర్తనలతో
కీర్తనలతో
కీర్తనల భక్తిసారాలతో
భక్తిసారలతో
భక్తి రక్తి ముక్తి సాధనలతో
పరమపద సోపానము చేర్చెడి
నీ కీర్తనలను భక్తితో విని ఆరాధించెద
శ్రీ స్వామీ త్యాగరాజ!
కౌండిన్య – 03/03/2023
