తిలక్ గారిలా కవితామృతం కురిపించాలనుంటుంది, కురిపించగలనా? అబ్బే కష్టమే.
ఠాగూర్ గారిలా పడవలో ప్రయాణిస్తూ
ఉత్తరాలు వ్రాయాలని ఉంటుంది, వ్రాయగలనా? అబ్బే కుదరదు.
విశ్వనాథ గారిలా వేయి పడగలు విప్పాలనిపిస్తుంది, విప్పగలనా? అబ్బే శక్తి చాలదు.
శంకరమంచి గారిలా అమరావతి కథల శిల్పాలు చెక్కాలని ఉంటుంది, చెక్కగలనా? అబ్బే ఆ ఊసు లేదు.
సిరివెన్నెల గారిలా పాటల సిరిజల్లులు కురిపించాలనిపిస్తుంది, కురిపించగలనా? అబ్బే ఆ ఆలోచనలే రాదు.
కాళిదాసులా దేవి అనుగ్రహం పోందాలని ఉంటుంది. పొందగలనా? అబ్బే కలలో కూడా సాధ్యం కాదు.
వాగ్దేవీ,
విద్యాదేవి,
వరించు తల్లీ!
కనికరించి
నీ కరుణ
నా పై కురిపించు తల్లీ!
ఓ చల్లని తల్లి,
తేట తెల్లని తల్లి!
కౌండిన్య – 25/01/2023