అల అప్పారావు ఆవరణలో
అరటి చెట్టుకి మొలిచింది ఓ గెల
వాటిని కోయకుండా ఒకణ్ణి పెట్టాడు కాపల
పాపారావు అనే అతను ఉంటాడు
అప్పారావు ఇంటి అవతల
అతనికి ఎప్పటినుండో
వాటిని కోసుకొని తినాలని ఓ పాపిష్టి కల
అవి పచ్చిగా ఉండటంతో
వేచి ఉన్నాడు ఓ నెల
పైగా కాపరి కాపలా ఉన్నాడెలా అంటూ
కొట్టుకుంది అతని మనసు గిల గిల
ఆలోచించి కొన్ని రోజులు
బాదుకున్నాడు తన తల
చివరికి పన్నాడు ఓ వల
ఓ రాత్రి పాపారావు కాపరిని
ఇంటిలోకి పిలిచి
తలుపు వేసాడు లోపల
కంగారులో గడియ మరిచాడు ఆవల
బయట కాస్తోంది పడుచు వెన్నెల
పాపారావు కి ఎందుకో వేసింది
భయం ఓ మారుమూల
పరుగు పరుగున వెళ్ళి
కూల్చేద్దామనుకున్నాడు వాటిని నేల
అక్కడకు వెళ్ళి చూసాడు
చీకట్లో గుడ్ల గూబలా
వాపోయాడు వెల వెలా
తీరా చూస్తే అక్కడ లేదు ఆ అరటి గెల
ఇంతలో కాపరి తలుపు తోసుకొని
పరుగున బయటకు పరెగెత్తుకొచ్చి చేసాడు గోల
ఇంకెక్కడి అరటి గెల?
పొద్దున్నే ఇలా వచ్చి అలా
కోతులెత్తికెళ్ళాయంటూ
భోరున ఏడ్చాడు విల విల
పాపారావు అనుకున్నాడు
ఇదంతా భగవంతుడి లీల
అప్పారావు అన్నాడు నన్ను
అడిగితే ఇచ్చే వాడిని కదా ఆ గెల
ముసి ముసి నవ్వుతో
అప్పారావు లోపలికి నడిచాడు
వాళ్ళ అబ్బాయికి పాడటానికి జోల
దీనిని తవిక రాసిన ‘కవి’గారి
ఇంటి పేరు కలవల
విధి ఆడే వింత నాటకం లా
కాదు కాదు ఇది ఓ కల!
కౌండిన్య – 22/03/2021
గమనిక: నిన్న ప్రపంచ కవితా దినోత్సవ సందర్భంగా మొదలెట్టిన తవిక ఒక రోజు ఆలస్యంగా పూర్తయ్యింది క్షమించాలి.
