Skip to content

Ramesh Kalavala

We all are stories in the end. Just make it a good one!

Menu
  • About
Menu

బంటు రీతి కొలువు –  త్యాగరాయ కృతి 

Posted on February 29, 2024January 12, 2025 by Ramesh

రాగం : హంసనాదం, తాళం : ఆది.
పల్లవి

బంటు రీతి కొలువు ఈయవయ్య రామా | (బంటు)అనుపల్లవి

తుంట వింటి వాని మొదలైన మదా- |

దుల గొట్టి నేల గూల జేయు నిజ || (బంటు)

( తా: తనకు కామ, క్రోధ మదాదులను కొనగోటితో సంహరించగల బంటురీతి కొలువు (సైనికుడు వంటి ఉద్యోగం) ఇమ్మని రామున్ని ప్రార్ధిస్తున్నాడు )చరణం

రోమాంచ మను ఘన కంచుకము |

రామ భక్తుడను ముద్ర బిళ్ళయు ||

రామ నామ మను వర ఖడ్గ మివి |

రాజిల్లు నయ్య త్యాగరాజుని కే || (బంటు)

(తా : రామ నామమనే ఖడ్గాన్ని, రామభక్తుడనే ముద్రబిళ్ళను, రోమాంచమనే ఘన కంచుకమ (రామనామం తలవగానే ఆనంద పారవశ్యం తో ఒంటిపై  నిక్కబొడుచుకొన్న వెంట్రుకలు అనే కవచం) ఇవ్వమని అడుగుతున్నాడు త్యాగయ్య )

కౌండిన్య – 29/02/2024

  • హిందోళ రాగం
  • “Cat and the Robin – A Dialogue”
  • హిందూస్తానీ సంగీతం 
  • సంగీత జ్ఞానం
  • నీలిమేఘములలో – 35 సినిమా
©2026 Ramesh Kalavala | WordPress Theme by Superbthemes.com