శంకరంబాడి సుందరాచారి (1944 – 1977) గొప్ప కవి, “మా తెలుగు తల్లికి మల్లె పూదండ” గీత రచయిత. పద్య కవిత్వం ఆయనకు ప్రీతిపాత్రమైన కవితా ప్రక్రియ. పద్యాలలోనూ “తేటగీతి” ఆయన ఎంతో ఇష్టపడ్డ ఛందస్సు. తేటగీతిలో ఎన్నో పద్యాలు వ్రాసారు. “నా పేరు కూడా తేటగీతిలో ఇమిడింది, అందుకనే నాకది బాగా ఇష్టం” అనేవారు. “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” గీతం కూడా తేటగీతిలోనే వ్రాసిందే. ఈ పద్యం ఆయన రచనలలో మణిపూస వంటిది. తెలుగు రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని రమ్యంగా వర్ణించిన నాలుగు తేటగీతి పద్యాలు అవి. ఆ రోజులలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించి గౌరవించింది

కౌండిన్య – 27/02/2014