ముళ్ళూ రాళ్ళు అవాంతరాలు ఎన్ని ఉన్నా
ముందు దారి మాది
ఉన్న చోటు చాలును మీకు
ఇంకా వెనక్కి పోతామంటారు కూడా
మీలో కొందరు
ముందుకు పోతాం మేము
ప్రపంచం మా వెనక వస్తుంది
అభిప్రాయాల కోసం
లక్ష్యం లెక్క పెట్టని వాళ్ళు
మా లోకి వస్తారు
శ్రీ శ్రీ – వ్యత్యాసం
