మనసులో ..
ఎన్నో ఆలోచనలు,
మరెన్నో దృశ్య కావ్యాలు,
దొంతరలు గా దొర్లుతున్న ఆలోచనలు!
కొన్ని మధుర సన్నివేశాలు,
మరికొన్ని దిగులు తెప్పించే దృశ్యాలు,
జీవితమంటే అదేగా సుఖదుఃఖాలు!
జాంజాటమైన ఆలోచనలు..
అగాధ లోతుల్లో పాతుకున్న పొరలనుండి అగ్ని పర్వత విస్పోటంలా ఫెలఫెలమని బయటకు తన్నుకు వస్తున్నాయి.
తీపి గురుతులు మాత్రం..
పైపై పొరల నుండి హర్షించి, ఘర్జించి
జలజలమని కురిసి, శీతల మేఘం లా మనసును తేలిక పరిచాయి.
అప్పుడు అనిపించింది..
మంచి జ్ఞాపకాలను మనసు లోతు పొరలలో సుస్థిరంగా దాచాలని..
బాధాకరమైన ఆలోచనలను పైపైన ఉంచి
మనసులోంచి త్వరగా మటు మాయం చేయాలని.
కౌండిన్య – 02/02/2025