ఆచార్య నాగార్జునుడు నడిచింది
నందికొండగా నాడు పలవబడేది
కృష్ణమ్మనదికి ఆనకట్టగా వెలసింది
నాగార్జునసాగరని నామధేయం చేసుకొంది
విష్ణుకుండినులు రాజ్యంగా ఏలింది
ఐక్ష్వాకుల ఇలవేలుపు అయ్యింది
శాతవాహనుల చారిత్రాత్మక స్థలమయ్యింది
నాగార్జునకొండగ నాంది పలికింది
ముక్త్యాలరాజుగారి కల పండింది
రాతికట్టడివారధి షష్టిపూర్తి చేసుకుంది
చాచానెహ్రూ పునాది వేసింది
బూర్గులవారు హజరు అయ్యింది
ఇందిరమ్మ కాలువలు ప్రారంభించింది
రైతులకు బ్రతుకుతెరువు చూపింది
విద్యుతోత్పత్తికి ఊపిరి అయ్యింది
పైలాన్లలకు తోడూనీడై నిలిచింది
మేరీమాతను సాగరుమాతగ చేసింది
ఏసుక్రీస్తు సినిమా చిత్రీకరించపడింది
గురుకులాలకు ఆశ్రయ మిచ్చింది
నాబోటి విద్యార్దులకు తోవచూపింది
కౌండిన్య