నేను ఎగరే గాలిపటమైతే
నువ్వు ఎగిరించే గాలివి!
నేను రేగే పెనుఉప్పెనైతే
నువ్వు రేగించే అలల నీరువి!
నేను విహరించే మేఘాన్నయితే
నువ్వు విహంగరించే ఆకాశానివి!
నేను మోయించే భారమయితే
నువ్వు మోసే థరిత్రివి!
నేను హ్రృదయంలో చిరుకాంతినైతే
నువ్వు హ్రృదయాలలో వెలిగే దీపానివి!
కౌండిన్య