సొంతైనా పరాయైన
తన సోదరుల బాగోగులు, సుఖసంపదలు కోరుకునే
తమ సోదరీ మణుల, రక్షణ కర్తవ్య దీక్షతో,
ఈరోజు;
అన్నకు చెల్లి,
తమ్ముడికి అక్క,
రక్షకట్టి,
ఆత్మీయత అనుభందాలను,
మమత అనురాగాలను,
ఆనందిస్తూ ,
దుఃఖం సంతోషాల్ని,
కోపం తాపాల్ని,
ద్వేషం ప్రేమల్నీ,
అలగడం మాన్పించడాల్ని,
పంచుకుంటూ,
అలమరికలు లేని అల్లిన రాఖీ దారంలా,
ప్రేమ, సౌభాగ్యాలను కలిపి నుదిటిమీద పెట్టిన ఎర్రటి తిలంకంలా,
కాంతి తో వెలగమని దీవించి ఇచ్చే హరతి లోని అగ్ని దేవతలా,
అదే చేతితో తీపి గురుతులు మరువరాదని తినిపించే అమృతంలా,
మనసా వాఛా కర్మణగా,
మన జీవన పయనం లో సాగరంగా,
తోడు నీడై రక్షణ గా!
కౌండిన్య