దేవకీ వసుదేవ సుతుడవు, యదుకులోత్తముడవు
బలరామానుజుడవు దుష్టకంసుని సంహరించిన వాడవు.
యశోద కుమార నందనుడవు, అల్లరి వాడవు
సర్వజగత్తుని జూపినవాడవు, వెన్న దొంగవు.
మునిజన పరి పాలుడవు, మురళీలోలుడవు
గోవర్థన గిరి నెత్తిన గోకుల బాలుడవు.
శిక్షణ పురిగొలిపిన పురజన, రక్షకుడవు
తాండవ మాడిన, ఆదిశేషుడవు.
పార్థునకు తోడుగ రథసారధై, నిలిచినవాడవు
గీతాసార మనే అమృతం కురిపించిన వాడవు.
రమణీయ గోపికలకు ఎదలలో, రాసలీల చూపినవాడవు
చీరలను దోచి వారికి , కర్తవ్యబోధచేసినవాడవు
కృష్ణయ్యా నీ లీలలు మరెన్నో, తెలిపినవాడవు
ద్వాపరయుగ దైవ, అవతారపురుషుడవు.
Jai Srikrishna,,,ahaa,,Srikrishna bhakti rasamrutanni entha chakkagaa andinchaaru. Sudhira and sekhar