అనుజుడు లక్ష్మణుడుని తోడ వశిష్ఠుడను ఆశ్రయించి
అస్త్ర శస్త్ర విద్యలు నేర్చితి వయ్యా
తాటకి చెవులు కోసి అరణ్య రక్షణ చేసి
ఋషుల యజ్ఞం కాపాడితి వయ్యా
ధనస్సు విరిచి ధీరునని చాటి
జానకిని పరిణయము గావించితి వయ్యా
మందర కైకేయి ఈర్ష్యకు బలి అయ్యి
సీతా లక్షణ సహిత అరణ్యము పాలైతి వయ్యా
రాజ్యము వదిలి వనవాసం పాలై
దశరథునకు బహు వేదన గొల్పితి వయ్యా
నీ పాదరక్షలు తోడ రాజ్యము ఏలగోలిన
తమ్ముడు భరతుని దీవించిన వాడి వయ్యా
రాయిని తాకి అహల్యగా మార్చి
శబరి కొరికిన ఫలము లారగించిన వాడ వయ్యా
మాయ లేడి వెనుక పడి
సీతామాతను రాక్షసునికి అప్పగించినా వయ్యా
తేకిడీకి ఏగి రామ తేకిడిగా మార్చి
వింధ్య పర్వతములు దాటి అన్వేషణ కొనసాగించితి వయ్యా
వానర అధిపతి వాలిని ఓడించి
సుగ్రీవునకు తిరిగి రాజ్యమును ఇప్పించితి వయ్యా
భక్తి తో మ్రొక్కిన సుందర భాష్యడు
హనుమంతుడు ని చేరదీసితి వయ్యా
వేయి యోజనాల లంకకు ఏగి
హనుమంతుడి తో సీతమ్మ జాడ తెలిసికొంటి వయ్యా
కపీ వానరులతో కడలికి సాగి
వారధి కల్పన చేయించితి వయ్యా
లంకకు సాగి రావణుని తోటి
ఘోర యుద్ధము సాగించి గెలుచితి వయ్యా
పుష్పక విమానం లో సీతా సహిత
అయోధ్య కు చేరి రాజ్యము తిరిగి నేలితి వయ్యా
లోక పరోక్షతో ధర్మ రక్షణకు
సతిని అడవులపాలు చేసినవాడ వయ్యా
సీతా వియోగక్షోభతో ఉన్నా రాజ్య క్షేమ కోరి
అశ్వమేధయాగం పూనితి వయ్యా
లవకుశ ద్వారా స్వీయచరిత్ర విని
జానకీ జాడ తెలుసుకొంటి వయ్యా
అవనిజ నినువీడి భువిలో కలిసిన
బహు దిగ్భ్రాంతి పొందినవాడ వయ్యా
మరా మరా మరా మ రామ రామ రామ
కౌసల్యా సుప్రజా రామ
సుగుణాభి రామ
అయ్యా, నా రామయ్య!