ఓ తల్లీ దుర్గమ్మ,
నీ కను చూపు చాలమ్మా!
నీవు చూపులతో దుఃఖాలను నశింపజేసే శుభప్రదవి.
దుర్గములైన దసేంద్రియములను హరింపజేసే త్రిలోక జననీ ప్రపద్గివి!
నవగ్రహ దోషాలను పోగొట్టి మమ్ములను అనుగ్రహించే మహాశక్తివి!
నీవు జనులను లాలన,పాలన చేసేటి మాతృమూర్తివి.
జ్ఞానము,సంపద,పటుత్వం ప్రసాదించే ముగ్గురమ్మలవు!
సృష్టి,స్థితి,లయలకు కారకు రాలివైన మూలపుటమ్మవు!
నీవు శక్తిలో ఆదిపరాశక్తివి.
జీవుడు, శివుడు లకు శక్తిని ప్రసాదించే జగజ్జననివి!
ప్రకృతిలో ఆధారశక్తివై
జగత్తును నడిపించే జగన్నాయకివి!
ఈ శరవన్నవ రాత్రుల లో
బాల త్రిపురసుందరి దేవిగా, గాయత్రి దేవిగా, అన్నపూర్ణేశ్వరి దేవిగా, కాత్యాయని దేవిగా,
లలితా త్రిపురసుందరి దేవిగా, మహాలక్ష్మి దేవిగా, సరస్వతి దేవిగా, దుర్గా దేవిగా, మహిషాసుర మర్థిని గా, శ్రీ రాజరాజేశ్వరి గానూ,
మమ్ములను అనుగ్రహించి,
నీ దివ్యశక్తి తో నిన్ను సదా కొలిచే,
నీ భక్తులను,
నీ బిడ్డలను,
ఎల్ల వేళలా కాపాడుము తల్లీ!
ఓ తేటతెల్లని గీర్వాణీ,
సమృద్ధి నిచ్చు సర్వమంగళీ,
శాంభవి, శారదా, భవానీ, జగదాంబా, శ్రీ విద్య, శ్రీ కాళీ, శ్రీ మాతా నీకు ఇదే నా నమస్సుమాంజలి!
కౌండిన్య