ఓ లేడి పిల్ల ఓ రోజు వాళ్ళ అమ్మతో నేనొక్కదాన్నే అడవిలో తిరిగి వస్తానని అడిగింది. నువ్వు ఇంకా చిన్న పిల్లవి నేను కూడా నీతో వస్తానంది. కాదూ నాకు అడవి అంతా తెలుసు కాబట్టి నేను వెళ్ళివస్తానంది. తల్లి ఒప్పుకోలేదు. ఆ తల్లి, లేడి పిల్ల బయలు దేరారు. అలా నడుస్తుంటే ఓ చోట వేటగాడు జంతువులను పట్టుకోవడానికి ఓ గుంత తొవ్వి, దాని మీద ఆకులు వేసాడు. ఆ తల్లి లేడి ముందు నడుస్తూ ఆ గుంతలో పడింది. లేడి పిల్ల పడబోతూ ఆగింది. కంగారు పడుతున్న అమ్మని భయపడవద్దని ధైర్యం చెప్పి సహాయం కోసం బయలు దేరింది. కొంత దూరం వెళ్ళింది ఎవరూ కనబడటం లేదు. తను వెళ్ళే దారి గురుతులు పెట్టుకుంటూ వెళ్ళింది. ఏదురుగా ఓ సింహం వస్తోంది. ఆ లేడి పిల్ల అలాగే ఉండి పోయింది, తన ఆలోచన తన తల్లి మీదే కాబట్టీ భయపడాలన్న ఆలోచన రాలేదు. ఆ సింహం కూడా ఆశ్చర్యబోయింది. ఆ సింహం అంతకు ముందే ఆరగించడం తో పెద్దగా ఆకలిగా లేదు పైగా ఈ జింక పిల్ల ముద్దుగా అలాగే కళ్ళార్పకుండా ఉండటం చూసి దానితో దగ్గరకు వచ్చింది. సింహం దగ్గరకు రాగానే ఆ పెద్ద ఆకారం చూసి లేడి పిల్లకు లోపల భయం వేసింది, అయినా ఇప్పుడు భయపడితే ఏమి లాభం అనుకొని ధైర్యం తెచ్చుకొని ఆ సింహం తో జరిగిందంతా చెప్పింది. దీనికంతా కారణం తనేనని, ఎందుకంటే తనకు తోడు రావడంతో ఇలా జరిగింది అని చెప్పింది. ఆ లేడి పిల్ల ను వాళ్ళ అమ్మ ఎక్కడుందో చూపించమంది ఆ సింహం. ఇద్దరూ కలిసి బయలుదేరారు. తను వచ్చిన దారిని జాగ్రత్త గా చూసుకుంటూ తీసుకెడుతోంది. అక్కడకు చేరగానే ఆ వేటగాడు వాళ్ళ అమ్మని కట్టేసి తీసుకెడుతూ కనిపించాడు. ఆ సింహం చాటుగా వెడిపోయింది, చూస్తోంది ఆ లేడి పిల్ల ఏమి చేస్తుందా అని. ఆ లేడి పిల్ల వెనక్కి తిరిగి చూసింది ఆ సింహం కనపడలేదు. తనే ఏదో ఓకటి చేయాలని నిశ్చయించుకొని ఆ వేటగాడి ముందుకు వెళ్ళినించుంది. అమాయకపు మొహం పెట్టింది. తన కళ్ళు పెద్దది చేసింది. దానిని చూడగానే ఆ వేటగాడికి కూడా భలే సరదా వేసింది. పట్టుకుందామని ప్రయత్నించాడు, చిక్కలేదు. అటు పరిగెత్తింది, ఇటు పరిగెత్తింది, నానా తిప్పలు పెట్టింది. ఆ కట్టేసిన లేడిని కింద పెట్టి మరీ దాని వెనక పరిగెత్తాడు. అయినా సరే లేడి పిల్లను పట్టుకోలేక పోయాడు వేటగాడు. ఆ సింహం ఇంకా చూస్తోంది. ఆ అలసిపోయిన వేటగాడు దానిని పట్టుకోవడం కష్టమని మళ్ళీ ఆ లేడి ని భుజం మీద వేసుకొని బయలుదేర వెళ్ళపోతే మళ్ళీ లేడి పిల్ల ఎదురొచ్చింది, తీసుకెళితే వెళ్ళనివ్వడం లేదు. సరేనని వెనుదిరిగి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ వెళ్ళి కాళ్ళు జారి ఆ వేటగాడు ఆ గుంతలో పడ్డాడు, కానీ ఆ తల్లి మాత్రం బయటపడింది. తల్లి దగ్గరకు లేడి పిల్ల వచ్చింది. తల్లికి ధైర్యం చెప్పింది. అదంతా చూస్తున్న ఆ సింహం చెట్టు చాటు నుండి వచ్చింది. సింహన్ని చూసి ఆ తల్లి కంగారుగా తన శక్తి అంతా ఉపయోగించి తన కట్లు ఊడేలా విదిలించుకుంది. లేచి తనూ పరిగెత్తడం మొదలు పెట్టింది, ఆ పిల్లని పరిగెట్టమంది. కానీ లేడి పిల్ల అక్కడే నించోని ఆ సింహం తో మాట్లాడడం మొదలు పెట్టింది. ఏదో సహాయం చేస్తానని ఎక్కడకు వెళ్ళావు అని నిలదీసి అడిగింది. ఆ సింహం ఆ లేడి పిల్లంటే భయంగా ఉన్నట్లు నటించింది. ఆ తల్లి ఆది చూసి ఆశ్చర్యం పోయింది. ఇంతలో ఆ వేటగాడు జాగ్రత్త గా ఆ గుంతలోంచి బయటపడ్డాడు. ఆ వేటగాడిని చూసి సింహం గాండ్రించింది. ఆ వేటగాడు పరుగెత్తాడు. లేడి పిల్ల అప్పటి వరకూ చనువుగా ఉన్నా ఆ గట్టిగా చేసిన శబ్థం వల్ల ఒక్క గెంతులో తల్లి దగ్గరకు చేరుకుంది, ఇద్దరూ పరిగెత్తారు. దారిలో అంతా ఆ తల్లీ జాగ్రత్తలు చెబుతూ వెడుతోంది, ఆ పిల్ల లేడి ఏమీ వినడం లేదు. తను మాత్రం సింహానికి ఈ సారి కలిసినపుడు పిల్లల ముందు అంత గట్టిగా అరవద్దని చెప్పాలని నిశ్చయించుకుంది. ఇంటికి చేరగానే తన ధైర్యానికి తల్లి మెచ్చుకుంది. వయసులో చిన్నది అయినా సమయస్పూర్తిగా సహాయం తీసుకొచ్చినందుకు ఆ లేడి పిల్లను దగ్గరకు తీసుకొని హత్తుకొంది.
శుభం భూయాత్!