Author: Ramesh
ఛందోబద్ధనామము
విద్యలన్నిటిలోను కవిత్వ విద్య శ్రేష్ఠమైనది. ఆ కవిత్వ లక్షణము ఛందశాస్ర్తముల వలననే తెలియును. చిటిక వేయునంత కాలములో ఉచ్ఛరించబడిన దానిని మాత్ర అందురు. (దీనిని వేసుకునే ఆత్రతో పొరపడరాదు). నా నామము రమేష్. ఇది నాలుగు చిటికలు వేయునంత కాలములో ఉచ్ఛరించవచ్చు(చిటికలు వేయుచూ నా నామము పల్కిన మీకే తెలియును). కొందరు మూడు చిటికలు వేయినంత కాలము లోనే నా నామము పలికినయెడల, వారు పలుకుటలో కొంచెం తొందరపడినట్లు తలుచుదును. మూడు అక్షరములకు నాలుగు మాత్రలేలా? అన్న…
సుగంధ సోడా
ఆ పార్టీ కార్యాలయానికి ఎదురుగా చెట్టునీడన సుగంధ సోడా బండి దగ్గర చిట్టెమ్మ కొడుకు మారం చేస్తున్నాడు. పొద్దెక్కిన వేళ కాబట్టి మొహం కడుక్కుంటే గానీ సుగంధ సోడా ఇవ్వనంటూ బెట్టు పెట్టింది చిట్టమ్మ, ఇస్తే గానీ లేవనంటూ పేచీ పెట్టి ఏడుస్తూ, మొత్తానికి కొడుకే నెగ్గాడు. చిట్టమ్మ ప్రేమంతా పోసి సుంగధ సోడా తయారు చేసి చేతికిచ్చింది, కుర్రాడు ఓ గుటక తాగి తన ఏడుపు ఆపి, ఎదురుగా బండి దగ్గరకు ఎవరో రావడం చూసి…
కౌండిన్య హాస్య కథలు 2 – ఇడ్లీ డే ( మాలిక పత్రిక )
గోంగూర వ్రతం – మా తెలుగు – తాళ్ మేగజైన్ 2018
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాళ్) యు కె 2018 “మా తెలుగు” విశిష్ఠ సంచికలో నా హాస్య కథ “గోంగూర వ్రతం”..
శంకర విజయం
శంకరవిజయం కవితల పోటీలో ప్రశంసాపూర్వక బహుమతి పొందిన కవిత. కౌండిన్య – 13/04/2018
కౌండిన్య హాస్య కథలు 1 – ఇదేం సరదా? ( మాలిక పత్రిక )
రామ తేకడి – రామ్‌టెక్
హే చందన్చీ ఘరాహే ..కీ ..వందన్చీ ఘరాహే! హే అభినందనా ఛే ఘరాహే! కాలాపేక్షాహి సూనా రామ్‌టెక్ ఘరాహే! రామ్‌టెక్ – నేను కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివిన ఊరు. పాతకాలంలో ఈ ఊరిని “రామ తేకడి” అని పిలిచే వారుట. మరాఠి భాషలో తేకడి అంటే పర్వతం అని అర్థం. ఇక్కడ ఉన్న వింధ్య పర్వతానికి శ్రీరాముడు అరణ్యవాస సమయంలో సీతా లక్ష్మణ సమేతంగా అడుగుపెట్టడం మూలాన దీనికి “రామ తేకడి” అని పేరు వచ్చిందని, ఈ…
పల్లకి
భటులు పరెగెత్తుకుంటూ మహారాజా గారి పడక గది బయటకు వచ్చి నించొన్నారు. అందులో ఒక భటుడు ఆయనకు వినపడేలా “ఆజ్ఞ మహారాజా” అంటూ రాజు గారికి ఏదో సందేశం తెలియజేయటానికి వచ్చినట్లుగా ఉన్నారు. విశ్రాంతి తీసుకుంటున్న రాజు గారు, భటుల అలికిడి విని కొంచెం విసుగు ప్రదర్శిస్తూ ప్రవేశించమని చెప్పమని అక్కడ ఉన్న భటుడికి సంజ్ఞ చేసారు, పడక గది తెర తీసారు. ఇద్దరు భటుడు లోపలకు ప్రవేశించారు. విశ్రాంతి తీసుకుంటున్న రాజుగారు మీసం మెలేస్తూ చెప్పండి…
“కౌండిన్య కథల కార్నర్” – సరికొత్త యు ట్యూబ్ చానల్
బస్సు స్టాపులో నించున్నాను. ఆయన తెలుగువారిలా ఉండటంతో “నే కథలు రాస్తానండి” అనగానే ఆయన అయితే అన్నట్లుగా ఎగా దిగా పైనుండి కిందవరకూ చూసాడు. కొంచెం దూరంగా జరిగాడు, నేను ఆయనకు దగ్గరగా జరిగాను. ఆయన చేతికి నా పుస్తకం అందించాను. ఆయన పేజీలు గిర్రున తిరగేసారు, దానికి చల్లటి గాలి తగిలి ఇదేదో బావుందని బస్సు కోసం అటు చూస్తూ దాంతో విసురుకోవడం మొదలుపెట్టారు. “లోపల ఓ పదిహేను కథలు.. “ అంటుండగా “ఈ మధ్య…