Author: Ramesh
కౌండిన్య హాస్య కథలు 6 – చెరగని మచ్చ ( మాలిక పత్రిక )
కౌండిన్య హాస్య కథలు 5 – ఎబ్రాడ్ రిటర్న్డ్ ( మాలిక పత్రిక )
మట్టి…ఒఠ్ఠి మట్టి.. శ్రీ సత్యం శంకరమంచి
మట్టి, దుమ్ము, ధూళి, దువ్వ….అందులో ఏమున్నాయి? అది ఒఠ్ఠి మట్టి కాదు …. అందులో ఉన్నాయి లక్ష కథలు…అణిగి మణిగి రేణువులై ఉన్నాయి కోటి బతుకులు … దేవరుల కథలు, దేవతల కథలు, వూళ్ళెళ్ళిన వాళ్ళ కథలు, ఊరేగిన వాళ్ళ కథలు, అడుక్కుతిన్న వాళ్ళ కథలు, అర్థాకలి గాళ్ళ కథలు, ఆశలు తీరని కథలు, చెట్టుకొమ్మెక్కిన కథలు, నక్షత్రాలైన కథలు, పక్షి కథలు, పావురాళ్ళ కథలు.. అన్నీ మనుషులు గాథలే .. ఎన్నో ఉన్నాయి ఆ మన్నులో…..
శ్రీరామ బాణాలు
సాహితీ సమరాంగణ సార్వభౌముడు ఆంధ్రభోజుడు అష్ట దిగ్గజ కవిరాజ పోషకుడ అగు శ్రీ కృష్ణదేవరాయలు రచించిన ప్రబంధ రాజము “ఆముక్తమాల్యద”. దీనిలో దశావతారాలు వర్ణిస్తూ శ్రీరామావతారం లో రాముడికి రావణాసురుడి కి మధ్య భీకర యుద్ధం జరుగుతున్నపుడు శ్రీరాముడి బాణాలు ఏలాటి శబ్థాలు చేస్తున్నాయో తెలియజేస్తూ ఆ పద్యాన్ని భీభత్స రసంలో (భయానకం) రచించారు. ఈ పద్యం చదవటానికి భీభత్సంగా ఉన్నా పక్కన ఉన్న వారిని పట్టించుకోకుండా నాలాగా గట్టిగా చదవేయండి ఫర్వాలేదు. రాయలవారి దారుణాఖండలశస్త్ర తుల్యమైన…
గు క
ఈ సారి గుంటూరు వెళ్ళినపుడు నాలానే పే…………ద్ద రచయితలు ఎవరు ఉన్నారా అని దీర్ఘంగా మబ్బుల వైపుకు చూస్తూ ఆలోచిస్తుంటే, సరిగ్గా అదే సమయానికి నా చిన్ననాటి మిత్రుడు, అనుకోకుండా పేరు సంపాదించిన రచయిత గవారా (గంథం వాసనల రావు) గాడు ఫోన్ చేసాడు. రచయితల కోసం వెతుకున్న సంగతి వాడికి చెప్పాను. అది విని “ఫలానా షాపులో గు క అనే పుస్తకం దొరుకుతుంది అంటూ వెకిలిగా పక పకా నవ్వాడు. పైగా గు క…
కాకితో కబురు – శ్రీ సత్యం శంకరమంచి
శ్రీ సత్యం శంకరమంచి గారి అమరావతి కథలలో ఒక అనిర్వచనీయమైన కథ ‘కాకితో కబురు’. ఈ అమరావతి కథల సంపుటికి కమనీయమైన ముందు మాట రాసిన శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారు ఈ కథ గురించి ప్రస్తావిస్తూ ‘కాకితో కబురు’ అన్న దానికి రచయిత మేఘసందేశం అంత స్థాయిని కలిపించారు అన్నారు. శంకరమంచి గారి కథలు, కథావస్తువులు, కథలలో పాత్రలు, ఇతివృత్తానికి తగ్గట్టు చేసిన ఊహలు చెప్పడానికి వాక్యాలు చాలవు అనడంలో అతిశయోక్తి లేదు. ఆ కథలకు…
కౌండిన్య హాస్య కథలు 4 – కథ కంచికి ప్రేక్షకులు ఇంటికి ( మాలిక పత్రిక )
శ్రీ యద్దనపూడి సులోచనారాణి గారి స్మరణలో కొత్త కథల సంపుటి
వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రముఖ నవలా రచయిత్రి శ్రీ యద్దనపూడి సులోచనారాణి గారి స్మరణలో 65 మంది తెలుగు రచయితల కొత్త కథలు కథా సంపుటి ఆవిష్కరణ గురువారం 26-07-2018 సాయంత్రం 5 గంటలకు శ్రీ త్యాగరాయ గాన సభ, చిక్కడ పల్లి, హైదరాబాదు ఆ కథా సంపుటిలో నా హాస్యకథ
కొత్త కథలు కథా సంపుటి – 2 శ్రీ యద్దనపూడి సులోచనారాణి గారి స్మరణలో
ఎగ్జామ్ పాసైనపుడు కూడా ఇన్ని సార్లు చూసుకోలేదు లిస్టులో నా పేరు కోసం.. వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రముఖ నవలా రచయిత్రి శ్రీ యద్దనపూడి సులోచనారాణి గారి స్మరణలో 65 మంది తెలుగు రచయితల కొత్త కథలు కథా సంపుటి 26-07-2018 సాయంత్రం 5 గంటలకు శ్రీ త్యాగరాయ గాన సభ, చిక్కడ పల్లి, హైదరాబాదు లో జరుగనుంది. ఈ సాకారానికి తోడ్పడిన డా తెన్నేటి సుధాదేవి గారికి, జ్యోతి వలబోజు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. కౌండిన్య…