తాళ్ యు కె మా తెలుగు మేగజైన్ ప్రచురణ – 2023
కౌండిన్య కథా గుచ్చః
( రెండు చిన్న కథల అనువాదం సంస్కృతం లోకి) కాకతాళీయం – వాడుక (తెలుగు) ఒక వ్యక్తి పొలంలో ఉన్నాడు. తాడి చెట్టు క్రింద కాకిని చూసాడు. పైనుండి తాడి పండు కాకి మీద పడింది. ఇది అనుకోకుండా జరిగింది. దీనినే “కాకతాళీయం” అంటాము. కాకతాళీయం – ఉపయుజ్జతామ్ (సంస్కృతం) ఏకస్మిన్ పురుషః క్షేత్రే అస్తి । సః తాళావృక్షస్య అథః కాకాం దృష్ఠవాన్ । ఉపరితః కాకస్య ఉపరి తాళాఫలం పతితమ్ । ఆకస్మికతయా ఏవ అభవత్…
స్వామీ త్యాగరాజా!
రాగాలతో రాగ భావాలతో భావాలతో భావామృత స్వరాలతో స్వరాలతో స్వరజతుల దివ్యక్షరాలతో దివ్యాక్షరాలతో దివ్యాక్షర కీ్ర్తనలతో కీర్తనలతో కీర్తనల భక్తిసారాలతో భక్తిసారలతో భక్తి రక్తి ముక్తి సాధనలతో పరమపద సోపానము చేర్చెడి నీ కీర్తనలను భక్తితో విని ఆరాధించెద శ్రీ స్వామీ త్యాగరాజ! కౌండిన్య – 03/03/2023
జల్లు కురిసే వేళ – బంగరు నావ
ఓ కథ, తరువాతి కథ వ్రాయి! సామాన్య జీవితాలు, చిరు అగచాట్లు. బాధ, వేదనతో కూడిన గాథలు, సరళంగా, స్పష్టతతో, ముక్కు సూటిగా చెప్పేలా, రోజూ వేయి కన్నీళ్ళు ప్రవహించే వాటి గురించి, వాటిలో విస్మరించని కొన్నిటి గూర్చి, విస్తృతమైన, వివరణ లేకుండా, సామాన్యంగా, దృఢమైన కథనంతో, సిద్దాంతాలకు, తత్వశాస్త్రాలకు తావులేకుండా, ఏ కథకు పూర్తి పరిష్కారం చూపకుండా, కొస ముగింపు లేకుండా, హృదయం మాత్రం ఆర్ద్రతతో నిండేలా, లెక్కలేని పదాలతో, అంతులేని కథలతో, విచ్చుకోకుండానే మొగ్గను…
ఏం చూసాను?
గమనిక: మొదటి విషయం : ఇలాంటి తవిత్వం వ్రాసిన వారిని నేను ఎక్కడా చూడలేదు అని మాత్రం కామెంటు పెట్టకండే. రెండో విషయం : బాబు, నువ్వు చూసింది చాలు అనేదాకా నే చూసినవన్నీ మీకు చెబుతూనే ఉంటాను. ఇక…అందుకోండి నేను “ఏం చూసాను” అనే నా భావ తవిత.
అబ్బే!
తిలక్ గారిలా కవితామృతం కురిపించాలనుంటుంది, కురిపించగలనా? అబ్బే కష్టమే. ఠాగూర్ గారిలా పడవలో ప్రయాణిస్తూ ఉత్తరాలు వ్రాయాలని ఉంటుంది, వ్రాయగలనా? అబ్బే కుదరదు. విశ్వనాథ గారిలా వేయి పడగలు విప్పాలనిపిస్తుంది, విప్పగలనా? అబ్బే శక్తి చాలదు. శంకరమంచి గారిలా అమరావతి కథల శిల్పాలు చెక్కాలని ఉంటుంది, చెక్కగలనా? అబ్బే ఆ ఊసు లేదు. సిరివెన్నెల గారిలా పాటల సిరిజల్లులు కురిపించాలనిపిస్తుంది, కురిపించగలనా? అబ్బే ఆ ఆలోచనలే రాదు. కాళిదాసులా దేవి అనుగ్రహం పోందాలని ఉంటుంది. పొందగలనా? అబ్బే కలలో కూడా సాధ్యం కాదు. వాగ్దేవీ, విద్యాదేవి, వరించు తల్లీ! కనికరించి నీ కరుణ నా పై కురిపించు తల్లీ! ఓ చల్లని తల్లి, తేట తెల్లని తల్లి! కౌండిన్య – 25/01/2023
కొసరి వడ్డన – మా తెలుగు – తాళ్ మేగజైన్ 2022
తాళ్ యు కె మా తెలుగు మేగజైన్ ప్రచురణ
గానగంధర్వ శ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారి స్మరణలో కొత్త కథల సంపుటి
గానగంధర్వ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంగారి స్మరణలో 80 మంది రచయితల కథాసంకలనం ( నా కథతో పాటు) త్వరలో విడుదల పేజీలు: 564 ధర: రూ. 400 – 20$ (పోస్టేజ్ కలిపి) ప్రారంభోత్సవ ఆఫర్: రూ. 200 (పోస్టేజ్ అదనం) కావలసినవారు జ్యోతి వలబోజు. 8096310140 కి gpay, phonepe, paytm ద్వారా డబ్బులు పంపించి, రసీదు, అడ్రస్ ఇదేనంబరుకు వాట్సాప్ చేయగలరు. ఈ ఆఫర్ జూన్ ముప్పైవరకు మాత్రమే..
మా తెలుగు – 2021
కొత్త (కరోనా) కథలు – 4 -గానగంధర్వ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంగారి స్మరణలో
కొత్త (కరోనా) కథలు – 4 – గానగంధర్వ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంగారి స్మరణలో 80 మంది రచయితల కథాసంకలనం గత నాలుగేళ్లుగా డా. ఆళ్ల శ్రీనివాసరెడ్డిగారి సహకారంతో, వంశీ రామరాజుగారి ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం ఒక స్పెషల్ పుస్తకం విడుదల అవుతోంది.. మొన్నటి, నిన్నటి, నేటి ఎంపిక చేసిన రచయితలతో కొత్తకథలు రాయించి అందమైన పుస్తకంగా తయారు చేసి హైదరాబాదులో భారీ సభ నిర్వహించి ప్రముఖుల సమ్ముఖంలో ఆయా రచయితలందరినీ వేదిక మీద సత్కరిస్తారు. ఇది ఒక పుస్తకం…