Skip to content

Ramesh Kalavala

We all are stories in the end. Just make it a good one!

Menu
  • About
Menu

ఏం చూసాను?

Posted on March 17, 2023 by Ramesh

గమనిక:

మొదటి విషయం :

ఇలాంటి తవిత్వం వ్రాసిన వారిని నేను ఎక్కడా చూడలేదు అని మాత్రం కామెంటు పెట్టకండే.

రెండో విషయం :

బాబు, నువ్వు చూసింది చాలు అనేదాకా నే చూసినవన్నీ మీకు చెబుతూనే ఉంటాను.

ఇక…అందుకోండి నేను “ఏం చూసాను” అనే నా భావ తవిత.

  • మంచు సుతి మెత్తగా భూమిని తాకినపుడు నేల పడిన గిలిగింతలు చూసాను!
  • ఉరుములు ఉద్రేకంతో నేలను చీల్చినపుడు ధరిత్రి పడిన భాధను చూసాను!
  • సన్నటి జడి వానలో తడుస్తూ ఆస్వాదిస్తున్న మనిషిని చూసాను!
  • ప్రళయ వాతావరణంలో చాలించమని చేతులు జోడించి ప్రార్ధించేవారిని చూసాను!
  • అమావాస్య చంద్రుడు నవ్వినపుడు ఆయన బుగ్గలో పడ్డ సొట్టని చూసాను!
  • సందెపొద్దులో అస్తమిస్తున్నభానుడి కి అలసటతో నుదుటి మీద పట్టిన చమటని చూసాను!
  • ఎండ కాచి వాన కురిసిన వేళ పలకరించడానికి బయటకు వచ్చిన ఇంద్రధనుస్సుని చూసాను!
  • పుప్పొడి కోసం వాలిన తేనెటీగతో పువ్వు ముచ్చటించడం చూసాను!
  • ఆకు చివర నీటి బిందువు తన భారాన్ని మోపలేక క్రిందపడుతూ భయంతో పెట్టుకున్న కన్నీళ్ళను చూసాను!
  • శివ పూజకు చిగురించిన త్రిదళంలో స్వామిని చేరే దాక పడే తపనను చూసాను!
  • మర్రి చెట్టు తన ఊడలను చూస్తూ మీసం మెలేయటం చూసాను!
  • నాణెంలో భాగాలు తన వెనక భాగం చూడలేక తాము చెందిన ఆవేదనను చూసాను!
  • బారుకొంగలు ఎగురుతూ ఒకరినొకరూ  కబుర్లు చెప్పుకోవటం చూసాను!
  • పళ్ళు లేని పండు అవ్వ, పండు పళ్ళను చప్పరించడం చూసాను!
  • చల్లగా, మెల్లగా వీస్తున్న చిరుగాలి కొమ్మరెమ్మ లకు జోలపాటలు పాడటం చూసాను!
  • అలమటించి, ఆకలి బాధతో, నీళ్ళు త్రాగి పస్తులున్న పేద కడుపులని చూసాను!
  • లేగదూడ తల్లి పొదుగులో ఆత్రంగా పాలు త్రాగడం చూసాను!
  • సిగిరెట్టు తాగే ధైర్యం లేని కుర్రకారు పొగమంచులో మంచు పొగల గింగిరాలు ఊదడం చూసాను!
  • ఆస్ట్రేలియా అడవుల్లో మనుషుల్సి చూసి కంగారూలు కంగారు పడటం చూసాను!
  • “పాపం మూగ జీవులు ఏమి మాట్లాడలేవు” అనడం చూసి జంతుజాతి “భాషలలో మా భాష వేరయా, విశ్వథాభి రామవినుర వేమ” అనుకోవడం చూసాను!
  • తన బోండాలని విదేశాలకు ఎగుమతి చేసారన్నా వార్త విని, తోటలో కొబ్బరి చెట్టు వేరే చెట్లతో “మా పిల్లలు ఫారెన్ వెళ్ళారు” అంటూ విర్రవీగడం చూసాను!
  • జ్వరం మాత్ర బొజ్జలోకి వెళ్ళి ఎ.సి వేయగానే కొంతసేపటికి ఒళ్ళంతా చల్లబడటం చూసాను!
  • “తిత్తి తీస్తా” అని వినబడగానే లోపల ఊపిరితిత్తులు భయంతో ఊపిరి బిగపట్టడం చూసాను!
  • తాళం చెవిలో పెట్టగానే లోపలి భాగాలు తాళంకప్పను తెరవటానికి అప్రమత్తం అవడం చూసాను!
  • కనీసం వచ్చే జన్మలోనైనా గాలి సోకగానే ఆవిరివ్వకుండా ఉండే వరం ఇవ్వమని కలరా ఉండలు కలిసికట్టుగాకమలాసునిడి (బ్రహ్మదేవుడు) ని కోరడం స్వయంగా నేను చూసాను!
  • రోమాలు నిక్కపొడుచుకోగానే “అబ్బా! వీడేంటి మరీ ఇంత ఫీలవుతూ మనకు పని పెట్టాడు” అంటూ అవి విసుక్కోవడం చూసాను!
  • స్కూలు లైబ్రరీ లో “టీచర్లు పిల్లల వీపు విమానం మ్రోత మోగించరాదు” అన్న నిశ్శబ్ధం బోర్డు చూసాను!
  • అద్దం వేరే అద్దం లో చూసుకొని “ఓలమ్మో నా సింగిల్ ఇమేజ్ కాకుండా సెంచెరీ ఇమేజ్ లు కనపడుతున్నాయి, కొంపదీసిఇది మహాభారతం నాటి మయసభలో అద్దం కాదు కదా?” అనకోవడం చూసాను!
  • ఎదుటి వారు ఏ భాషవారైనా సరే మనసు వాళ్ళు పడే బాధను వెంటనే అర్థం చేసుకో కలగడం చూసాను!
  • కౌండిన్య – 23/03/2023
  • హిందోళ రాగం
  • “Cat and the Robin – A Dialogue”
  • హిందూస్తానీ సంగీతం 
  • సంగీత జ్ఞానం
  • నీలిమేఘములలో – 35 సినిమా
©2026 Ramesh Kalavala | WordPress Theme by Superbthemes.com