అల అప్పారావు ఆవరణలో అరటి చెట్టుకి మొలిచింది ఓ గెల వాటిని కోయకుండా ఒకణ్ణి పెట్టాడు కాపల పాపారావు అనే అతను ఉంటాడు అప్పారావు ఇంటి అవతల అతనికి ఎప్పటినుండో వాటిని కోసుకొని తినాలని ఓ పాపిష్టి కల అవి పచ్చిగా ఉండటంతో వేచి ఉన్నాడు ఓ నెల పైగా కాపరి కాపలా ఉన్నాడెలా అంటూ కొట్టుకుంది అతని మనసు గిల గిల ఆలోచించి కొన్ని రోజులు బాదుకున్నాడు తన తల చివరికి పన్నాడు ఓ వల…
Author: Ramesh
డూ డూ బసవన్న
.. సన్నాయి అప్పన్న డూ డూ బసవన్నకు రంగు రంగుల బొంతలు కప్పి, మూపురాన్ని రంగు చీరతో చుట్టి, పొట్ట చుట్టూ పట్టు చీరలతో ముస్తాబు చేసి, కాళ్ళకు గజ్జెలు కట్టి, నొసట అందమైన తోలు కుచ్చులు చుట్టి, కొమ్ములకు ధగ ధగ మెరిసే ఆభరణాలు పెట్టి, డూ డూ బసవన్నా ఇటురారా బసవన్నా ఉరుకుతు రారన్నా రారన్న బసవన్నా అమ్మవారికీ దండం బెట్టు అయ్యగారికీ దండం బెట్టు మునసబు గారికి దండంబెట్టూ కరణం గారికి దండంబెట్టూ రారా బసవన్నా, రారా బసవన్నా.. అంటూ సన్నాయి అప్పన్న బూర ఊదుతూ, ఆ ప్రక్కన మనిషి డోలు వాయిస్తూ, మరో పక్కన చిన్న అప్పన్న శ్రుతి సన్నాయి ఊదుతూ.. చక్కటి వేషధారణలతో నెత్తికి రంగుల తలగుడ్డలు, మూతిమీద కోర మీసాలు, చెవులకు కమ్మల జోడులు, ఎదుటివారు ఇచ్చిన పాత కోటులు, భుజంమీద కండువాలు, చేతికి వెండి మురుగులు, నుదురున పంగనామం, సైకిల్ పంచ కట్టు.. మేళతాళాలు, వాయిద్య విన్యాసాలు, రణగొణ ధ్వనులు, బసవన్న బుడిబుడి అడుగుల నృత్యాలు. ఇవన్నీ ప్రాచీన జానపద కళా రూపాలు, సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు సాంప్రదాయ చిహ్నాలు! మీ అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. కౌండిన్య – 13/01/2021
నీగీకుడు
నీ గీకుడు.. అంటూ దూకుడు స్టైల్లో మీరు ఓ పాటేసుకునేలోగా ఓ విషయం చెబుతాను. ఈ గీతల పిచ్చి ఎలా మొదలయ్యిందో చెప్పాలంటే ఫ్లాష్ బ్యాక్ లోకెళ్ళాలి. సన్నిహితులు బొమ్మల గురించి ఇచ్చే ప్రోత్సాహం ఇంతా అంతా కాదు, పైగా ఎలా చేయగలగుతున్నారని అడుగుతున్నారు కాబట్టి ఇది వ్రాయడం మొదలు పెట్టాను.. బ్యాగ్ గ్రౌండ్‌లో నా పాట ఆపొద్దు.. ఎదైనా ఓ బొమ్మను మీరు చూసేరానుకోండి మీరు ఏం చేస్తారు? నేనైతే దాన్ని పదే పదే చూస్తాను,…
శాపం
నిన్నొక రామ తీర్థం, రేపొక శివ క్షేత్రం, అడుగడుగున అగుపిస్తున్న దీన హీన దృశ్యం, పదేపదే ప్రతిబింబిస్తున్న పైశాచిక ద్వేషం. మిత్రమా! భారతదేశ చరిత్రకేదో శాపం ఉంది, చిత్రమో, విచిత్రమో మన సమాజంలో ఎనలేని లోపం ఉంది, కనిపించని ప్రభావానికి లొంగుతున్న నికృష్ట దోషం కూడా ఉంది. నీతిని వదిలేసిన రాజనీతి, జాతి సంస్కృతిని వెలివేసిన నవత రీతి. గ్రహించడం లేదు పాపం వీళ్ళు, కట్టడాలు కూల్చినా, విగ్రహాల తలలు త్రెంచినా, ఏమీ పట్టనట్లు నిద్రిస్తున్న వారిని…
సీతా సందర్శనం
ఈ రోజు మార్గశిర శుద్ధ త్రయోదశి. అశోక వనంలో సీతమ్మ వారిని శింశుపావృక్షం మీదనుండి హనుమంతుల వారు మొట్టమొదట దర్శించిన రోజు. సీతమ్మ వారిని హనుమంతుల వారు అంతముందు చూడనేలేదు. సాగర లంఘనం చేసి, నగర ప్రవేశం చేసిన తరువాత అమ్మవారి జాడ కనబడక ఆయన పడిన మనస్తాపం అంతా ఇంతా కాదూ. సీతమ్మ వారి కోసం లోపల అన్నీ ప్రదేశాలు గాలించాడు. అద్భుతమైన అంతఃపురాన్ని, లోపల పట్టమహిషిలను, పక్కన ఉన్న పానశాలను కూడా పరికించాడు. అంతఃపురం…
Gurudev
హే భూగోళం..
“హే భూగోళం ప్లే ఆనంద భైరవి సాంగ్స్”..”హే భూగోళం నిన్నే..” అంటుంటే “భూగోళం కాదు బామ్మ హే గూగుల్ అంటే గానీ పలకదు” అన్నాడు మనవడు. అదేదో నువ్వే అడగరా అంటూ ‘ఆనంద భైరవి’ ఎలా పలకాలో వాడికి చెప్పింది, వాళ్ళ మనవడు దాన్ని “హే గూగుల్ ప్లే ఆనంద భైరవి మూవీ సాంగ్స్” అని అడిగాడు. అది వెంటనే “ప్లేయింగ్ అనకొండ సాంగ్స్ ఆన్ యూ ట్యూబ్” “నీ బొంద..” అంది బామ్మగారు. “నేను అడిగింది…
Drawings
మధ్యతరగతిమధురిమలు – సీక్వెల్
(గమనిక : ఇది మధ్యతరగతి మధురిమలు చూసిన వారు మాత్రమే చదువవలనని మనవి.. చూడని వారు ముందుగా అమెజాన్ ప్రైమ్ లో చూడండి, బావుంది.. నాకైతే నచ్చింది.. ఇక సీక్వెల్) “చందాలకి ఐదువందల్ చాలదా?.. హోటల్ పెట్టి రెండు సంవత్సరాలు కాలే.. ఇంతకంటే ఎక్కువ ఇయనీకి నేనైమే హౌలాగాని లెక్క కనపడుతున్నాను బే” అంటాడు రాఘవేంద్ర. “అన్నా.. వీడే అన్నా.. క్రితం సంవత్సరం ఎదురుగా న్యూ రాఘవేంద్రా హోటల్ బోర్డు పెడుతుంటే పీకాడు” అన్నాడు ఒకడు. “వీడి…
నవ్వుల నజరాన -కవిసార్వభౌమ కవికుశలశర్మ
నవ్వుల నజరాన – పుస్తక విడుదల – స్టాలు- 101 ఎన్ టి ఆర్ గ్రౌండ్, హైదరాబాదు. మొన్న నాకు కనకాభిషేకం ఎలా చేయాలో అరటిపండు వొలిచిపెట్టినట్లు చెప్పినా ఏ నాథుడు ముందుకు రాలేదు కదూ! పోనీలేండి. అన్నట్లు ఏ నాథుడు అన్నాను కదా అసలు ఆ గొప్ప కనకాభిషేక సత్కారం పొందిన తొలి తెలుగు కవి కవిసార్వభౌముడైన శ్రీనాథుడు గురించి ముందుగా ప్రస్తావించి అసలు విషయం లోకి వెడతాను. విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయల అనంతరం పరిపాలించిన…